Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ..?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో చోటు చేసుకొన్న మార్పువల్లే బాలేశ్వర్‌లో రైలు దుర్ఘటన చోటు చేసుకొందని కేంద్ర రైల్వే మంత్రి పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పే కారణమని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. తుది నివేదిక వచ్చాక కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. అప్పుడే ప్రమాదానికి గల కారకులను, ప్రమాద పరిస్థితులను కచ్చితంగా వెల్లడించగలమని మంత్రి వివరించారు. రైల్వేలో ప్రమాదాల నివారణకు ఈ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..?
ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటం దీని ప్రాథమిక విధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపి ఉంచుతుంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొనడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీంతోపాటు రైల్వే ఆపరేషన్లలో భద్రత మరింత బలోపేతం అయింది. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, కంప్యూటర్లను వినియోగించుకొంటుంది. గతంలో మాన్యూవల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో భర్తీ చేశారు. గతంలో సిగ్నల్స్‌ను నియంత్రించడానికి రాడ్లు, స్విచ్‌లను వినియోగించేవారు.
ఇంటర్ లాకింగ్ ఫీచర్స్..
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో వేగంగా స్పందించే అవకాశం, రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, కచ్చితత్వం వంటి సానుకూలాంశాలు ఉన్నాయి.
ఈ వ్యవస్థలో ట్రాక్‌పై రైళ్ల లొకేషన్లు గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌బ్యాకింగ్ పరికరాలు వాడతున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సురక్షితను పెంచేందుకు ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నల్స్, పాయింట్స్, ట్రాక్ సర్క్యూట్స్ వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో వాటిని సమన్వయం చేసుకొంటూ ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చూస్తుంది.
రూట్ సెట్టింగ్, రూట్ రిలీజ్, పాయింట్ ఆపరేషన్స్, ట్రాక్ ఆక్యూపెన్సీ మానిటరింగ్, ఓవర్‌లాప్ ప్రొటెక్షన్, క్రాంక్ హ్యాండిల్ ఆపరేషన్స్, లెవల్ క్రాసింగ్ గేట్ ఇంటర్‌లాకింగ్, ప్రొవిజన్ ఫర్ బ్లాక్ వర్కింగ్ వంటి పనులను చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?