Updated : 18 Dec 2021 14:01 IST

Omicron: యూకేలాంటి పరిస్థితిమన దగ్గరవస్తే.. కేంద్రంకీలక హెచ్చరిక!

కొవిడ్‌ జాగ్రత్తలు మరవొద్దన్న వీకే పాల్‌

దిల్లీ: ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది. డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో కూడిన ఈ కొత్త వేరియంట్‌ కేసులు మన దేశంలో 111 నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒమిక్రాన్‌, కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే.. అలాంటి పరిస్థితులు గనక భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్ హెచ్చరించారు. యూకే మాదిరి పరిస్థితి భారత్‌లో గనక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే, ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోజుకు 65వేల చొప్పున వస్తుండగా.. అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో ప్రతిరోజూ 13లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్‌లో 80శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్‌ పూర్తయినప్పటికీ డెల్టా ఉద్ధృతి తగ్గడంలేదన్నారు.

అందువల్ల ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్‌ కేసులే వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్‌ గుర్తు చేశారు.

Read latest National - International News and Telugu News


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్