S 400: ఎస్-400 ఆంక్షలపై కచ్చితంగా చెప్పలేం: అమెరికా
భారత్ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఎటువంటి ఆంక్షలు విధించలేమని కచ్చితంగా చెప్పలేమని అమెరికా స్టేట్డిపార్ట్మెంట్ ప్రతినిధి వెల్లడించారు. ఎవరికి పూర్తిగా లేదా కొన్ని అంశాలకు సంబంధించి
ఇంటర్నెట్‌డెస్క్: భారత్ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఎటువంటి ఆంక్షలు విధించలేమని కచ్చితంగా చెప్పలేమని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి వెల్లడించారు. ఎవరికి పూర్తిగా లేదా కొన్ని అంశాలకు సంబంధించి కచ్చితమైన మినహాయింపులు ఇవ్వాలని కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ యాడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్) చట్టంలో లేదని వివరించారు. ఇటీవల కాలంలో భారత్-అమెరికా రక్షణ బంధాలు బలపడ్డాయని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని వెల్లడించారు.
రష్యా ఎస్-400 వ్యవస్థల డెలివరీలను మొదలు పెట్టిందని ఇప్పటికే ప్రకటించడంతో అమెరికా స్పందించింది. ఇప్పటికే జోబైడెన్ కార్యవర్గం.. మిత్రదేశాలు రష్యాతో లావాదేవీలకు దూరంగా ఉండాలని కోరింది.
2019లో అక్టోబర్‌లో రష్యా నుంచి 5.43 బిలియన్ డాలర్ల విలువవైన ఎస్-400 వ్యవస్థ కొనుగోళ్లకు భారత్ అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసింది. కానీ, రష్యా నుంచి కోనుగోలు చేసే ఎస్-400 కారణంగా భారత్‌పై కాట్సా ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.
2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత రష్యాపై ఈ ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ఏదైనా భారీ రక్షణ రంగ పరికరాలను కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. కాట్సా చట్టం ప్రకారం ఇరాన్, ఉ.కొరియాతో కొన్ని రకాల లావాదేవీలు జరిపినా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్