ఈ బడ్జెట్‌ పేదలకా? సంపన్నులకా?

పేద ప్రజలకు పక్కనబెట్టి కేవలం సంపన్న వర్గాల కోసమే బడ్జెట్‌ను రూపొందించారని కాంగ్రెస్‌ ఎంపీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన నేడు

Published : 11 Feb 2021 14:20 IST

రాజ్యసభలో చిదంబరం విమర్శలు

దిల్లీ: పేద ప్రజలను పక్కనబెట్టి కేవలం సంపన్న వర్గాల కోసమే బడ్జెట్‌ను రూపొందించారని కాంగ్రెస్‌ ఎంపీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన నేడు మాట్లాడారు. పేదలకు ఎలాంటి హామీ ఇవ్వని ఈ బడ్జెట్‌ను తాము తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. 

‘‘ప్రభుత్వ విధానాలు, కరోనా మహమ్మారి వల్ల దేశంలో 12కోట్ల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. 35శాతం ఎంఎస్‌ఎంఈలు మూతబడ్డాయి. వెనుకబడిన రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ సమస్యలకు ఒకటే పరిష్కారం.. నిపుణులు, ఆర్థికవేత్తల నుంచి విలువైన సలహాలు తీసుకుని వ్యవస్థీకృత సమస్యలను పరిష్కరించాలి. కానీ, ప్రభుత్వం ఏం చేసింది. పేదలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. అలాంటప్పుడు ఈ బడ్జెట్‌ ఎవరికోసం రూపొందించారు? ఇది కేవలం సంపన్నుల కోసం సంపన్నులు తయారుచేసిన బడ్జెట్‌ మాత్రమే. పేదలకు ఎలాంటి సహకారం ఇవ్వలేని ఈ పద్దును మేం తిరస్కరిస్తున్నాం’’ అని చిదంబరం తెలిపారు. 

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతోంది. శుక్రవారం ఆర్థికమంత్రి సీతారామన్‌.. రాజ్యసభలో విపక్షాల ప్రశ్నలపై సమాధానమివ్వనున్నారు. ఆ తర్వాత రాజ్యసభను మార్చి 8కి వాయిదా వేయనున్నారు. శనివారం లోక్‌సభలోనూ రిప్లై ఇచ్చిన అనంతరం ఆ సభ కూడా వాయిదా పడనుంది. 

నిజానికి బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు ఈ నెల 15 వరకు జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగానే వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరిగి మార్చి 8 నుంచి రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

ఇవీ చదవండి..

చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని