Anindita Chatterjee: పిల్లలుంటే ఏమైంది? నెలల పాపతో 10 దేశాలు చుట్టి వచ్చా!
పిల్లలు చిన్నవాళ్లని.. అందుకే విహార యాత్రలకు వెళ్లడం లేదంటూ కొందమంది చెబుతుంటారు. అలాంటి వారికి ముంబయి చెందిన ట్రావెలర్ అనిందిత (Anindita Chatterjee) చేసిన సూచనలేంటో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కొక్కరిది ఒక్కో అభిలాష. కొందరు ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడితే.. ఇంకొందరు మాత్రం ప్రపంచం (World) చుట్టేసి రావాలనుకుంటారు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దేశ విదేశాల్లో తిరగాలని (Travelling) మనసులో బలంగా కోరిక ఉన్నప్పటికీ పెళ్లి, పిల్లలు అయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా స్త్రీలకు ఇది వర్తిస్తుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమో? వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఎన్నో ఆలోచనలు. వీటన్నింటికీ చెక్ పెడుతున్నారు ముంబయి చెందిన అనిందితా ఛటర్జీ (Anindita Chatterjee).
ఉద్యోగానికి రాజీనామా చేసి..
41 ఏళ్ల అనిందితా ఛటర్జీకి విదేశాల్లో పర్యటించడమంటే మహా సరదా. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించేవారు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి ఆమె విదేశీ పర్యటనలు కొనసాగించారు. అలా 2017లో @travel.chatter ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించి తన పర్యటన విశేషాలను అందులో పంచుకునే వారు. 2020లో పూర్తిగా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్‌కే కేటాయించారు. తాను గర్భవతినని తెలిసేసరికి ఆమె మెక్సికోలో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యలు వెంటనే ఆమెను వెనక్కి వచ్చేయమని చెప్పారు. అయినా ఆమె వినలేదు. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే తిరిగి ముంబయికి వచ్చారు.వైద్యుడి సూచన మేరకు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ విహారయాత్రలు మొదలు పెట్టారు అలా గర్భవతిగా ఉన్నప్పుడే నాలుగు దేశాల్లో పర్యటించారు అనిందిత.
87 దేశాల్లో పర్యటించి..
డెలివరీ అయిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారట. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఫాలోవర్లకు చేరవేసేవారు. ఆమె ట్రావెలింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 87 దేశాల్లో పర్యటించారట. ‘‘ ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. గర్భవతినైతే తప్పేంటి. అందులో వింతేముంది. గర్భవతి అయినంత మాత్రాన మనం నిత్యం చేస్తున్న పనులను ఆపడం లేదు కదా. అందుకే నేను కూడా ట్రావెలింగ్ ఆపలేదు.’’ అంటూ చెప్పుకొచ్చారు అనిందిత. మెక్సికో, కొలంబియా లాంటి ఎన్నో సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి ఆ విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె ప్రతి రోజూ క్రమం తప్పకుండా కనీసం 10 కిలోమీటర్లు నడుస్తారట.
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..
చిన్న చిన్న కారణాలతో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అనిందిత చెబుతున్నారు. మనం మన కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించినప్పుడే.. మన పిల్లలు కూడా వాటిని చూస్తూ పెరిగి.. వాళ్ల కలలను సాకారం చేసుకుంటాని ఆమె అంటున్నారు. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ముందుగా దాని గురించి పరిశోధన చేసి, అక్కడ చూడదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయేమో తెలుసుకున్న తర్వాతనే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారట. అయితే పాప పుట్టిన తర్వాత వీలైంత వరకు పగటిపూట ట్రావెల్ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నామని చెబుతున్నారు. చిన్నారి కూడా తమ ట్రావెలింగ్‌కు ఎంతో సహకరిస్తోందని, కొత్తవారు ఎదురైతే హాయ్ అంటూ వారిని పలకరిస్తోందని, ఆమె కూడా ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుండటంతో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని అనిందిత వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Politics News
Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్..: డీకేఎస్