‘బ్యాట్‌ ఉమన్‌’ను కలిసిన WHO నిపుణులు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వుహాన్‌లో ‘బ్యాట్‌ ఉమన్‌’ను కలిసారు.

Updated : 04 Feb 2021 11:23 IST

వుహాన్‌: కరోనా మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం, చైనా నగరం వుహాన్‌ సందర్శనలో ఉంది. ఈ క్రమంలో వారు ‘బ్యాట్‌ ఉమన్‌’గా పేరుతెచ్చుకున్న  ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షీ ఝెంగ్‌లీతో సహా పలువురు చైనా శాస్త్రవేత్తలను కలిశారు. ఈ సమావేశం వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీలో సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగింది. వుహాన్‌కు చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం.. కొవిడ్‌ నియమాలను అనుసరించి రెండు వారాలు క్వారంటైన్‌లో గడిపిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు వారాలు క్షేత్ర స్థాయి పరిశీలనలో గడపనుంది.

‘‘నేడు డాక్టర్‌ షీ ఝెంగ్‌లీతో సహా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో అత్యంత కీలక సమావేశం జరిగింది. వారిని ముఖ్యమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకొన్నాము’’ అని నిపుణుల బృంద సభ్యుడు పీటర్‌ డెస్‌జాక్‌ ట్వీట్‌ చేశారు. గబ్బిలాల ప్రమాదకరమైన పరిశోధనలు నిర్వహిస్తుండటంతో.. డాక్టర్‌ షీ ఝెంగ్‌లీకి బ్యాట్‌ ఉమన్‌గా‌ పేరు వచ్చింది. చైనాలోని వుహాన్‌ లేబోరేటరీ2019 చివరిలో కరోనా వైరస్‌ లీకై ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందనే ప్రచారం ఉంది. కాగా ల్యాబ్‌లో లీక్‌ కారణంగానే మహమ్మారి పుట్టిందనే వాదనను షీ ఝెంగ్‌లీతో సహా పలువురు శాస్త్రవేత్తలు తిరస్కరిస్తున్నారు.

ఇవీ చదవండి..

యూఎస్‌ను తలదన్నేందుకు చైనా అడ్డదారులు

రికవరీలు.. కొత్త కేసులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని