వ్యాక్సిన్ అనుమతిపై WHO ఏమందంటే..!
వ్యాక్సిన్లకు అనుమతిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది.
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు అనుమతిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్ నిర్ణయం దోహదపడుతోందని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ కేత్రాపాల్ సింగ్ వెల్లడించారు. ప్రాధాన్యత కలిగిన ప్రజలకు వ్యాక్సిన్ అందించడం, ప్రజారోగ్య రక్షణ చర్యలు, ప్రజల భాగస్వామ్యాన్ని నిరంతరం అమలు చేయడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ఉదయం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని వెల్లడించారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 70.42శాతం సమర్థత కలిగిన్నట్లు ఆయన తెలిపారు. విదేశాల్లో దాదాపు 23వేల మంది వాలంటీర్లపై ఆక్స్ఫర్డ్ జరిపిన టీకా ప్రయోగ వివరాలతో పాటు భారత్‌లో జరిపిన 1600 మంది వాలంటీర్ల సమాచారాన్ని విశ్లేషించినట్లు వెల్లడించారు. విదేశాల్లో జరిపిన ప్రయోగ ఫలితాలతో సమానంగా ఇక్కడ కూడా వ్యాక్సిన్ సమర్థత చూపించినట్లు పేర్కొన్నారు. ఇక మూడో దశ ప్రయోగాలు కొనసాగిస్తోన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కూడా సురక్షితంగానే ఉన్నట్లు నిపుణుల కమిటీ తెలిపిన విషయాన్ని సోమాని వెల్లడించారు. మొదటి, రెండో దశల్లో 800 వాలంటీర్లపై జరిపిన ప్రయోగాల వివరాలను ఆ సంస్థ నిపుణుల కమిటీ ముందు వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై జరుపుతుండగా, ఇప్పటికే 22,500 మంది వాలంటీర్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ ప్రకటించారు. వీరందరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని స్పష్టంచేశారు. వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ మూడో దశ ప్రయోగాలు మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ తెలిపింది.
ఇవీ చదవండి..
భారత్‌లో టీకా వచ్చేసింది..
ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్తరకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్