Indias space industry: గగనతలాన్ని ఏలేందుకు భారత్ అడుగులు..!
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ప్రయోగించనున్నారు. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సెక్టార్‌కు ఇదో గొప్ప ముందడుగు.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ప్రస్తుతం అంతరిక్ష రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రయోగ ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు వేగవంతం చేశాయి. పౌండు బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాలంటే 2011లో నాసా 30వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్ ఆ ఖర్చును 1,200 డాలర్లకు తగ్గించింది. భవిష్యత్తులో ఈ ధరలు తగ్గేకొద్దీ అంతరిక్ష మార్కెట్ మరింత విస్తరిస్తుంది. ఈ విషయాన్ని భారత్ కూడా గుర్తించింది. ప్రస్తుతం ఇస్రోకు కేటాయిస్తున్న 14వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ నేపథ్యంలో దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
అంతరిక్ష రంగంలో మనం ఎక్కడ..?
చాలా ఏళ్లపాటు భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఏకఛత్రాధిపత్యం ఉంది. కానీ, దాని బడ్జెట్ పరిమితులతో అనుకున్నంత వేగంగా పరిశోధనలు జరగడంలేదు. దీంతో ఈ రంగంలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లో బోయింగ్, స్పేస్ఎక్స్, ఎయిర్‌బస్, వర్జిన్ గెలాక్టిక్ వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇస్రో బీహెచ్ఈఎల్ సహకారంతో పీఎస్ఎల్వీ రాకెట్ తయారీకి వివిధ కంపెనీలను కలిపి కన్సార్టియం ఏర్పాటుకు యత్నిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాకెట్ల ఖర్చు (లాంఛ్‌వెహికల్స్) గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలోనే భారత అంతరిక్ష రంగం ఆరోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా స్పేస్‌టెక్ కంపెనీల్లో కేవలం 3.6శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. 2019 నాటికి భారత అంతరిక్ష రంగం విలువ 7 బిలియన్ డాలర్లు. ఇది 2024 నాటికి దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంతరిక్ష కార్యకలాపాల అంతర్జాతీయ విపణి పరిమాణం ఇప్పుడు 400 బిలియన్ డాలర్లు ఉంటే, సమీప భవిష్యత్తులో ఇది 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఈ విభాగంలో అమెరికా అత్యధికంగా 56.4శాతం కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. కానీ, ఇక్కడ భారత్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం మన సొత్తు. కేవలం 75 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పెరుగుతున్న స్టార్టప్‌లు..
భారత్‌లో ఇప్పటికే దాదాపు 50కుపైగా స్పేస్ స్టార్టప్‌లు ఇస్రో వద్ద రిజిస్టర్ అయ్యాయి. వీటిల్లో రాకెట్లు తయారు చేసేవి, ఉపగ్రహాలు నిర్మించేవి ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ పర్యవేక్షణలోని అగ్నికుల్ సంస్థ రాకెట్ ఇంజిన్లను నిర్మిస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ రాకెట్లను తయారు చేస్తున్నాయి. ఇక బెంగళూరుకు చెందిన బెలాట్రిక్స్ ఏరోస్పేస్ రాకెట్లను, ఉపగ్రహ ఇంజిన్లను రూపొందిస్తోంది. ఇక డిజంత్రా స్పేస్ ఉపగ్రహ విడిభాగాలను నిర్మిస్తోంది. భారత్ అంతరిక్ష విధానాలను ఇటీవల మరింత సరళీకరించింది. ఇస్రో అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదలాయిస్తోంది. మరోవైపు స్పేస్ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు కూడా 2021లో 198శాతం పెరిగి 67 మిలియన్ డాలర్లకు చేరాయి. 2020లో వచ్చిన పెట్టుబడులు 22 మిలియన్ డాలర్లు మాత్రమే.
రాకెట్ ప్రయోగాలు ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్) ఒప్పందం కిందకు వస్తాయి. క్షిపణి టెక్నాలజీ వ్యాప్తిని నిరోధించే ఈ ఒప్పందంలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాకెట్ ప్రయోగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇన్-స్పేస్ అనే నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు కంపెనీలు భారత్‌లోని మౌలికవసతులను వినియోగించుకొనేలా ఇది సాయం చేస్తుంది. ప్రైవేటు సంస్థలకు , ఇస్రోకు మధ్య వారథిగా పనిచేస్తుంది.
ప్రైవేటు రంగం రాకతో పెనుమార్పులు..
స్పేస్ రంగంలోకి ప్రైవేటు సంస్థల రాకతో భవిష్యత్తులో ఉపగ్రహాల వినియోగం భారీగా పెరగనుంది. కంపెనీలు సొంతంగా ఉపగ్రహాలు ప్రయోగించి.. డేటా మ్యాపింగ్, వాతావరణం అంచనా వేయడం, పారిశ్రామిక సర్వేలు, నీరు- ఇంధనం గుర్తించడం, వ్యవసాయం, రహదారులు, కమ్యూనికేషన్లు ఇలా విస్తృత అవసరాలకు వినియోగించవచ్చు. భవిష్యత్తులో డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అందుబాటులోకి వస్తే.. సెల్టవర్ల వినియోగం నిలిపివేసే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్‌కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్‌శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్‌కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్‌లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్‌పుర్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్‌పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..