Delta plus: ‘డెల్టాప్లస్‌’పై రాహుల్‌ 3 ప్రశ్నలు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను కేంద్రం ‘ఆందోళనకర రకం’గా

Updated : 25 Jun 2021 14:58 IST

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను కేంద్రం ‘ఆందోళనకర రకం’గా పేర్కొనడం, దీని కారణంగా మూడో దశ ముప్పు రావొచ్చని నిపుణులు హెచ్చరించడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ‘డెల్టా ప్లస్‌’ వ్యాప్తిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ రకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో చెప్పాలంటూ కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు. 

‘‘డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై మోదీ ప్రభుత్వానికి ప్రశ్నలు:

1. ఈ వైరస్‌ను గుర్తించి, వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృత పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు?

2. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయి, దీనిపై పూర్తి సమాచారం ఎప్పటికి తెలుస్తుంది?

3. మూడో దశ ఉద్ధృతిలో ఈ వేరియంట్‌ను నియంత్రించేందుకు ప్రణాళికలేంటీ?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు.

దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఈ రకం కేసులు వెలుగుచూస్తుండగా.. మరణాలు కూడా సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్రాలకు అడ్వయిజరీలు జారీ చేసింది. మరోవైపు ఈ వేరియంట్‌ సంక్రమణ వేగం, తీవ్రత దృష్ట్యా దీన్ని ఆందోళనకర రకంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని