జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే: దిల్లీ హైకోర్టు
జీవిత భాగస్వామి ఎలాంటి కారణంగా లేకుండా శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అని, ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చని దిల్లీ హైకోర్టు తెలిపింది.
దిల్లీ: జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా శృంగారానికి (sexual relationship) నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని దిల్లీ హైకోర్టు (Delhi High Court) పేర్కొంది. పెళ్లయిన తర్వాత కేవలం 35 రోజుల పాటే కలిసున్న ఓ జంట మధ్య వివాహ బంధం (Marriage) పరిపూర్ణం కాకపోవడంతో వారికి ఫ్యామిలీ కోర్టు విడాకులు (Divorce) మంజూరు చేసింది. ఈ విడాకులను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే..
సదరు జంట 2004లో వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజులకే భార్య పుట్టింటి వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో ఆ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు (Family Court) వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఈ విడాకులను సవాల్ చేస్తూ ఆ భార్య దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది.
ఎంతో ప్రయాసతో తెలంగాణ ఏర్పాటు: లోక్‌సభలో ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ
‘‘శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిదే. శారీరక బంధంలో నిరాశకు మించిన దారుణం వైవాహిక జీవితానికి మరొకటి ఉండదు. ప్రస్తుత కేసులో.. భార్య శృంగారానికి నిరాకరించడంతో వారి వివాహ బంధం పరిపూర్ణం కాలేదని కోర్టు గుర్తించింది. అంతేగాక, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆమె వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఎలాంటి కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ఇది దారుణ పరిస్థితే. అందువల్ల ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చు’’ అని దిల్లీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
గాంధీ జయంతి నాడు చంద్రబాబు, భువనేశ్వరి నిరసన దీక్ష
-
Heart Disease: రోజూ 50 మెట్లు ఎక్కండి.. గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి!
-
‘1,400 ఎకరాల డీల్ కోసమే సీఎం జగన్తో అదానీ రహస్య భేటీ’
-
వైతెపా విలీనంపై 4 రోజుల్లో దిల్లీ నుంచి పిలుపు!
-
పాపులర్ అవ్వడానికి బదులు దూరమయ్యా: జాన్వీకపూర్
-
నేటి నుంచి ఆన్లైన్ గేమింగ్ పూర్తి పందెం విలువపై 28% జీఎస్టీ