Stalin: 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం స్టాలిన్‌ ప్రకటన

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 75వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Published : 25 Jun 2024 23:29 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 75వేల ఉద్యోగాలను 2026 జనవరి నాటికి భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ లక్ష్యాన్ని నెరవేర్చేలా ప్రభుత్వం 18 నెలల కాలాన్ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్లు సమచారం.

ఇప్పట్నుంచి రాబోయే 18 నెలల కాలంలో టీఎన్‌పీఎస్సీ ద్వారా 17,595 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్టాలిన్‌ వెల్లడించారు. అలాగే, తమిళనాడు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 19,260 పోస్టులు, మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 3,041 పోస్టులు,  యూఎన్‌ యూనిఫాం సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 6,688 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వీటితో పాటు సాంఘిక సంక్షేమ, పురపాలక, నీటి సరఫరాల శాఖల్లో 30,219  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని