Nirmala Sitharaman: బ్యాంకులకు ఎగ్గొట్టిన ప్రతిరూపాయి వసూలు చేస్తాం..!

బ్యాంకులకు రుణ ఎగవేతదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. ఎగవేతదారులు భారత్‌లో ఉన్నా

Published : 23 Nov 2021 18:21 IST

జమ్మూ: బ్యాంకులకు రుణ ఎగవేతదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఎగవేతదారులు భారత్‌లో ఉన్నా.. విదేశాలకు పారిపోయినా సరే వారు బ్యాంకుల నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని వెనక్కి తెప్పిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఆర్థిక మంత్రి.. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 

‘‘బ్యాంకుల్లో ఎలాంటి మోసాలు జరిగినా.. తీసుకున్న రుణాలను ఇప్పటివరకు చెల్లించపోయినా.. వాటిపై మన వ్యవస్థ కఠినంగా పనిచేస్తోంది. ఎగవేతదారులు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలను తిరిగి బ్యాంకులకు కట్టేలా చేస్తాం. ప్రస్తుతం అది జరుగుతోంది కూడా..!’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకుల్లో మొండిబకాయిలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ‘4R’ విధానాన్ని అవలంభిస్తోందని చెప్పారు. రికగ్నిషన్‌, రిజల్యూషన్‌, రిక్యాపిటలైజేషన్‌, రిఫామ్స్‌ విధానంతో తక్షణ ఫలితాలు కన్పిస్తున్నాయని అన్నారు. 

‘‘బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఎగవేతదారులు భారత్‌లో ఉన్నా.. దేశం విడిచి పారిపోయినా వారిపై చర్యలు తీసుకుంటున్నాం. వారి ఆస్తులను జప్తు చేసి న్యాయపరమైన ప్రక్రియ చేపడుతున్నాం. ఎగవేతదారుల ఆస్తులను వేలం వేసి ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు అందజేస్తున్నాం. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది’’ అని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని