
RSS: ‘అతిగా ఆధారపడితే.. చైనాముందు తలొంచాల్సి వస్తుంది’
ముంబయి: చైనాపై ఆధారపడటమనేది పెరిగితే.. భవిష్యత్తులో మనం దాని ముందు తలవంచాల్సి వస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘స్వదేశీ అంటే ఇతర దేశాలను నిర్లక్ష్యం చేయడం కాదు. ఇక్కడా అంతర్జాతీయ మార్కెట్ ఉండాలి. కానీ.. అది మన నిబంధనల ప్రకారం నడచుకోవాలి. ఈ క్రమంలో మనకు ‘స్వ- నిర్భర్ (స్వీయ నిర్భరత)’ సాధించాల్సిన అవసరం ఉంద’ని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ముంబయిలోని ఓ పాఠశాలలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో ఇంటర్నెట్, టెక్నాలజీ వినియోగం ఎక్కువ. కానీ.. ఇందులో చాలావరకు బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. అన్ని వర్గాల సంక్షేమం, సంతోషానికి.. ఆర్థిక భద్రత ముఖ్యం. వికేంద్రీకృత ఉత్పత్తి వ్యవస్థతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయ’న్నారు. ప్రభుత్వం ఈ దిశగా పరిశ్రమ రంగానికి దిశానిర్దేశం చేయాలని కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.