ప్రధాని మాటలను గౌరవిస్తాం..కానీ..!

రైతులతో చర్చల విషయంలో ప్రధానమంత్రి ప్రతిపాదనలను గౌరవిస్తామని, అదే సమయంలో రైతుల ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటామని రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టంచేశారు.

Published : 31 Jan 2021 17:15 IST

ఒత్తిడి వాతావరణంలో చర్చలు కుదరవు
రైతు సంఘం నాయకులు నరేశ్‌ టికాయిత్‌

దిల్లీ: రైతులతో చర్చల విషయంలో ప్రధానమంత్రి ప్రతిపాదనలను గౌరవిస్తామని, అదే సమయంలో రైతుల ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటామని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయిత్‌ స్పష్టంచేశారు. ఆందోళన సందర్భంగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేసి చర్చలకు సామరస్య వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామని ప్రధానమంత్రి ప్రకటించిన నేపథ్యంలో రైతు సంఘం నాయకులు ఈ విధంగా స్పందించారు.

‘కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్‌ తమకు నమస్కరించాలని రైతులు కోరుకోవడం లేదు. ప్రధానమంత్రి ఉన్నతిని, ఆయన చెప్పిన మాటలను తప్పకుండా గౌరవిస్తాం’ అని రైతు సంఘం నాయకులు రాకేశ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా జనవరి 26వ తేదీన జరిగిన ఘటనలు కుట్రలో భాగమేనన్న ఆయన, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. జాతీయ పతాకం అన్నింటికంటే ఉన్నతమైందని, పతకానికి అవమానం కలిగించిన వారిని ఎవ్వర్నీ సహించకూడదు’ అని దిల్లీ గాజీపుర్‌ సరిహద్దు వద్ద నిరసన చేస్తోన్న రైతు సంఘం నాయకులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ విషయంలో గౌరవప్రదమైన నిర్ణయం రావాల్సి ఉందన్న ఆయన, ఒత్తిడి వాతావరణంలో చేసే ఎలాంటి నిర్ణయాలను మేం అంగీకరించమని స్పష్టంచేశారు. శాంతియుత వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా రైతు సంఘం నాయకులను విడుదల చేసి చర్చలకు శాంతియుత వాతావరణం కల్పించాలన్నారు.

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్‌ భారతావని దుఃఖించిందని మన్‌కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ట్రాక్టర్‌ ర్యాలీలో భాగంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ఘటనను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి..
త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది
ఎవరీ రాకేశ్‌ టికాయిత్‌..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని