Published : 25/08/2021 18:09 IST

Afghan teacher: మమ్మల్ని చంపినా.. బాలికల విద్య కోసం పోరాడతాం.. 

కాందహార్‌: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తమ అరాచక పాలనకు తెరలేపారు. మహిళల హక్కులను గౌరవిస్తామన్న ప్రకటన నీటి మూటలుగా మారింది. మహిళలు, బాలికల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తూ బాలికల అభ్యున్నతికి మంగళం పాడుతున్నారు. కానీ అక్కడి ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మాత్రం బాలిక విద్య కోసం పోరాడతామని అభయమిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టైనా బాలికల విద్య కోసం పోరాటం చేస్తామంటున్నారు.

కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఓ ఉపాధ్యాయుడు టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ‘నా వృత్తి పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. నా ప్రాణం పోయినా నేను ఈ వృత్తిని వదులుకోను’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. ‘తాలిబన్లు దేశాన్ని తిరిగి ఆక్రమించుకున్న తర్వాత మా హక్కుల్ని కోల్పోతామేమోనని ఎంతో భయపడ్డాం. కానీ మా హక్కులకు భంగం కలిగించమని, పాఠశాలలకు వెళ్లకుండా మమ్మల్ని ఆపబోమని వారు పేర్కొన్నారు. ఒకవేళ మమ్మల్ని అడ్డుకున్నా సరే.. మేము ఆగిపోము. మా మనోధైర్యాన్ని కోల్పోము. బాలికల విద్య కోసం పోరాడుతాం’ అని ఆయన వెల్లడించారు.

హెరాత్ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషన్‌ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అఫ్గానిస్థాన్‌ ఉన్నత విద్యాధికారి తెలిపారు. మహిళా ఆచార్యులను మహిళా విద్యార్థుల బోధనకు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని