పార్లమెంట్‌ బయట రోజూ నిరసన: రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కిసాన్‌ సంయుక్త మోర్చా తన తదుపరి కార్యాచరణను ప్రకటించింది. రాబోయే వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్......

Published : 04 Jul 2021 23:57 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కిసాన్‌ సంయుక్త మోర్చా తన తదుపరి కార్యాచరణను ప్రకటించింది. రాబోయే వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్‌ వెలుపల రోజూ నిరసన తెలపాలని నిర్ణయించింది. సమావేశాలు పూర్తయ్యేంత వరకూ నిత్యం 200 మంది రైతులు ఈ నిరసనలో పాల్గొంటారని రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ చౌదనీ తెలిపారు. జులై 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై పోరాడాలని కోరుతూ సమావేశాల్లో పాల్గొనబోయే విపక్ష పార్టీ ఎంపీలకు సమావేశాలకు రెండు రోజుల ముందు లేఖలు ఇవ్వనున్నామని గుర్నామ్‌ సింగ్‌ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించేంత వరకూ సమావేశాలు సజావుగా జరగనివ్వబోమని చెప్పారు. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్పున ఈ నిరసనల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్‌ ధరల పెంపును నిరసిస్తూ జులై 8న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనున్నామని తెలిపారు. ఆ రోజు ప్రజలంతా ధరల పెరుగుదలకు నిరసనగా తమ తమ వాహనాలను ఉదయం 10 నుం 12 గంటల మధ్య జాతీయ/ రాష్ట్రీయ రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిలుపుదల చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని