S Jaishankar: మోదీ కెప్టెన్సీలో మేం బౌలింగ్‌ చేస్తే.. జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

క్రికెట్‌ జట్టులాగే తాము కూడా కేవలం సొంతగడ్డపై మాత్రమే గాక, విదేశాల్లోనూ మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నామని అన్నారు కేంద్రమంత్రి జైశంకర్ (S Jaishankar)‌. క్రికెట్‌ ఆటను విదేశాంగ విధానానికి ముడిపెడుతూ ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది.

Published : 03 Mar 2023 22:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనితీరు, విదేశాంగ విధానాలు ఎలా ఉన్నాయో వివరించారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ (S Jaishankar)‌. అయితే ఎప్పటిలా రాజకీయ కోణంలో కాకుండా దానికి కాస్త క్రికెట్‌ టచ్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని క్రికెట్ జట్టుతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ కెప్టెన్సీలో తాము బౌలింగ్‌ చేస్తే వికెట్ పడాల్సిందేనన్నారు. విదేశాల్లోనూ తాము మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నామంటూ భారత విదేశాంగ విధానం ప్రాముఖ్యతను ఆసక్తికరంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది.

దిల్లీలో జరిగిన రైజినా డైలాగ్‌ 2023 చర్చాగోష్ఠి కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌ మోదీతో.. మా నెట్‌ ప్రాక్టీస్‌ ఉదయం 6 గంటలకే మొదలై.. అర్ధరాత్రి దాకా కొనసాగుతుంది. కెప్టెన్‌ మోదీ తన బౌలర్లకు కొంత స్వేచ్ఛనిస్తారు. అలాంటి అవకాశం ఇస్తే.. ఆ బౌలర్‌ నుంచి వికెట్ ఆశిస్తారు కదా..!’’ అని జైశంకర్‌ (S Jaishankar)‌ అన్నారు.

ఇక విదేశాంగ విధానంపై ఇటీవలి కాలంలో ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి గురించి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఎక్కువ మంది ప్రజలు దీని (విదేశాంగ విధానాలను ఉద్దేశిస్తూ) గురించి ఆలోచిస్తున్నారు. ఇక, దీనికి రెండో కారణం.. భారత గ్లోబలైజేషన్. క్రికెట్‌ జట్టులాగే.. మేం కూడా కేవలం సొంతగడ్డపై మాత్రమే గాక.. విదేశాల్లోనూ మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నాం’’ అని అని కేంద్ర మంత్రి (S Jaishankar)‌ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని