
US: ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం.. ప్రవాసుల తిరుగు ప్రయాణం
దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆ దేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. సోమవారం నుంచి అమెరికా-భారత్ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు ప్రస్తుతం తిరుగు ప్రయాణమవుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని వారు పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా గతేడాది మార్చి 23న అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే సాధారణ ప్రయాణాలను పునరుద్ధరించడం తమ లక్ష్యమని ఆ దేశం పేర్కొంటోంది. భారత్ సహా చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాకు చెందిన ప్రయాణికులపై కూడా యూఎస్ ఆంక్షలను తొలగించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల వరకూ జరిమానా విధించనున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది.
యూఎస్‌కు ప్రయాణమయ్యే ముందే విదేశీ పౌరులకు వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న కొవిడ్ పరీక్ష ‘నెగెటివ్’ రిపోర్టును అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అయితే మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు, జల మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 18 ఏళ్ల లోపు వారు టీకాలు తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. రెండేళ్లు, అంతకంటే చిన్న పిల్లలకు కొవిడ్ పరీక్ష అవసరం లేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్ 3 ఓవర్లకు 16/1
-
Politics News
BJP: హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?
-
Business News
Ola Electric: ఈవీ రేస్: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?
-
India News
Mohammed Zubair: ఆల్ట్న్యూస్కు పాక్, సిరియా నుంచి విరాళాలు..!
-
Sports News
IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!