Metro Pillar: మెట్రో పిల్లర్‌ కూలి.. తల్లి, మూడేళ్ల కుమారుడి మృతి

బెంగళూరులో మెట్రో పిల్లర్(Metro Pillar) కూలి తీవ్ర ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 10 Jan 2023 15:33 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్( Metro Pillar) కూలి ఇద్దరు మృతి చెందారు. నగవర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

ద్విచక్రవాహనంపై వెళ్తోన్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ జారిపడింది. దాంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందగా.. తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

‘ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న నలుగురిపై ఈ పిల్లర్ పడిపోయింది. అందులో తల్లీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది’అని బెంగళూరు ఈస్ట్‌ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాదంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడారు. ‘దీని గురించి ఇప్పుడే సమాచారం అందింది. ఈ ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించాం. బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తాం’అని వెల్లడించారు. బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL)రూ.20 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో కూడా ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఠాణెలోని వివియానా మాల్‌లో దగ్గర్లోని మెట్రో పిల్లర్‌కు అమర్చిన ఐరన్ రాడ్ పడిపోవడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు