Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
తనకు కాబోయేవాడికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్(Google), మెటా(Meta), మైక్రోసాఫ్ట్(Microsoft) వంటి దిగ్గజ సంస్థలూ ఉద్యోగాల్లో కోత(Layoffs) విధిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులపైనే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటిదే ఓ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. తనకు కాబోయేవాడికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని సలహా కోరుతూ ఓ యువతి అడిగిన ప్రశ్న ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.
‘కుటుంబ సభ్యులు మా ఇద్దరికీ వివాహం కుదిర్చారు. ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే నన్ను పెళ్లిచేసుకోబోయేవాడిని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ ఉద్యోగంలోంచి తొలగించింది. నా కుటుంబానికీ ఈ విషయం తెలుసు. ఇప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? తెలియడం లేదు. అతన్ని పెళ్లాడొచ్చా? అతని వేతనం రూ.2.5 లక్షలుగా ఉండేది’ అని ఓ గుర్తుతెలియని యువతి ఓ సోషల్ యాప్ వేదికగా పోస్టు పెట్టారు. ఇది కాస్త ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
యువతి పోస్టుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలు వ్యాపార లావాదేవీల్లా మారిన నేపథ్యంలో.. దీన్ని అలాగే పరిగణించాలని కొందరు స్పందించారు. అతనికి నీకంటే మంచి వ్యక్తి దొరుకుతారని మరికొందరు కామెంట్లలో చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జనవరిలో మైక్రోసాఫ్ట్ సంస్థ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: గ్రూప్-1 రాసిన 100మంది అభ్యర్థులతో జాబితా.. సిద్ధం చేసిన సిట్
-
Politics News
Revanth Reddy: పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్
-
India News
Mann Ki Baat: అవయవదానానికి ముందుకు రావాలి.. ప్రధాని మోదీ
-
Movies News
Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్ స్టార్: సమంత
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత