
డేటింగ్ యాప్‌తో ఆందోళనకారుల్ని పట్టిస్తున్నారు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ఖరారు చేయడానికి జనవరి 7న అమెరికా కాంగ్రెస్ సమావేశమైన విషయం తెలిసిందే. క్యాపిటల్ భవనంలో ఈ సమావేశం జరిగే వేళ ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా కొందరు ఆందోళనకు దిగారు. ఏకంగా భవనంలోకి చొరబడి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, బలగాలు రంగంలోకి దిగి.. పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆందోళనలో పాల్గొని టీవీల్లో కనిపించిన మరికొందరిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ విషయంలో సాయం చేయడం కోసం కొంతమంది మహిళలు డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్నవారిని యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తున్నారట. ఓ మహిళ ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఏకంగా ఆ డేటింగ్ యాప్ ఈ విషయంలో చర్యలు తీసుకోవడం విశేషం.
కొంతమంది మహిళలు ‘బంబుల్’ అనే డేటింగ్ యాప్‌లో కావాలని తమ కంటెంట్ ప్రాధాన్యతను రాజకీయం విభాగానికి మార్చుకున్నారు. అనంతరం ఆ విభాగంలో వచ్చే వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నారు. ఎవరైనా తాము క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్నామని గొప్పగా చెప్పుకుంటూ ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. వాటిని ఎఫ్‌బీఐకి పంపుతున్నారు. తనకు తెలిసిన ఓ మహిళ ఈ విధంగా ఆందోళనకారుల్ని డేటింగ్యాప్లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తోందని అలిన్ అనే మహిళ ట్వీట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. క్యాపిటల్ భవనంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తులు ఈ యాప్‌లో ఉన్నారని తెలియడంతో ‘అలాంటి వ్యక్తుల్ని మీ యాప్‌లో యూజర్లుగా ఉండనిస్తారా?’ అని బంబుల్‌ను నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారిని పట్టిస్తున్న మహిళలను అభినందిస్తున్నారు.
దీంతో ఈ విషయంపై బంబుల్ యాజమాన్యం స్పందించింది. ‘చట్టవిరుద్ధ కంటెంట్‌ను బంబుల్ ఉపేక్షించదు. మా పాలసీని ఉల్లంఘించిన, క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్న యాప్ యూజర్ల అకౌంట్లను తొలగిస్తాం’అని ఇటీవల ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చింది. అలాగే, యాప్‌లో రాజకీయం విభాగాన్ని తాత్కాలికంగా తొలగించింది.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
covid update: వీడని మహమ్మారి పీడ.. తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. నిలకడగా ఆడుతున్న విహారి, పుజారా
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
-
India News
IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
-
Movies News
Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్‌ప్రీత్ హాట్ స్టిల్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి