Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) లోక్‌సభలో ఆమోదం పొందింది.
దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టగా.. బుధవారం దీనిపై చర్చ (Debate) జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.
మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోదీ సభలోకి వచ్చారు.
గురువారం రాజ్యసభకు..
లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మరుసటి రోజు (సెప్టెంబర్ 21)న రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్‌ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్‌కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్‌లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. -
అంబేడ్కర్‌కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్‌లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాగ్రామ్‌లో వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్‌కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు