
పారదర్శకతతో పనిచేయండి.. పెట్టుబడిదారులుగా మారొద్దు: సీఎం బొమ్మై
బెంగళూరు: పారదర్శకతతో పనిచేయాలని, పెట్టుబడిదారులుగా మారేందుకు ప్రయత్నించొద్దంటూ డీసీసీబీ సభ్యులకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సూచించారు. మంగళవారం కలబురగి, యాదగిరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘం అన్ని డొమైన్లలోకి ప్రవేశించాలన్న ముఖ్యమంత్రి.. సహకార రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సహకార సంస్థల్లో ఉన్న వారు సహకార సంఘాలుగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి పాటు పడాలన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో సహకార రంగం ప్రజల జీవితంలో అంతర్భాగంగా మారిందని కర్ణాటకలోనూ జరగాలని కోరారు. సామాన్యులకు అందించే రుణాలు, ఇతర సౌకర్యాలు సహకార బ్యాంకుల్లో లభించే విధంగా షెడ్యూల్డ్ బ్యాంకుల్లో అందుబాటులో లేవనీ.. సహకార బ్యాంకులు పూర్తిగా ప్రత్యేకమైనవని బొమ్మై అన్నారు. సహకార రంగం అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సహకార శాఖ మంత్రిగానూ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. త్వరలో దేశంలో సహకార రంగం విప్లవాన్ని సృష్టిస్తుందని బొమ్మై ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.