World Bank halts aid: అఫ్గాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల నిలిపివేత..!
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంక్ రంగంలోకి దిగింది. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను
ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు అధికారంలోకి వస్తే.. అఫ్గాన్ అభివృద్ధి భవిష్యత్తుపై, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అఫ్గాన్‌కు చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇది అఫ్గానిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ.
‘‘అఫ్గానిస్థాన్‌లో మా ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశాం. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇన్నేళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకొనేందుకు అక్కడ కొనసాగే విషయంపై మా భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నాం. అఫ్గాన్ ప్రజలకు మా మద్దతు కొనసాగుతుంది’’ అని ప్రపంచబ్యాంకు ప్రతినిధి పేర్కొన్నారు.
2002 నుంచి ప్రపంచ బ్యాంకు ఇక్కడ 5.3 బిలియన్ డాలర్లను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈ మొత్తంతో అఫ్గాన్ పునర్ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. కానీ, తాలిబన్ల ఆక్రమణ తర్వాత పనులు నిలిచిపోయాయి. దీంతో తమ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ప్రపంచబ్యాంకు పాకిస్థాన్‌కు తరలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!