Internet సమస్య.. నిలిచిన ప్రముఖ వెబ్‌సైట్లు

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వెబ్‌సైట్లకు ఇంటర్నెట్‌ సమస్య తలెత్తింది. దీంతో భారత్‌ సహా పలు దేశాల్లో ఈ సైట్లు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్‌ సమస్యల కారణంగానే

Updated : 08 Jun 2021 17:34 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వెబ్‌సైట్లకు ఇంటర్నెట్‌ సమస్య తలెత్తింది. దీంతో భారత్‌ సహా పలు దేశాల్లో ఈ సైట్లు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్‌ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు న్యూయార్క్‌ టైమ్స్‌, ది గార్డియన్‌, బ్లూమ్‌బర్గ్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో పాటు అమెజాన్‌.కామ్‌, రెడిట్‌, కోరా, పే పాల్‌, హెచ్‌బీవో మాక్స్‌, హూలూ వంటి సైట్లకు కూడా ఈ సమస్య తలెత్తింది. 

ఈ సైట్లు ఓపెన్‌ చేస్తుంటే సర్వీస్‌ ఎర్రర్‌ చూపిస్తోంది. సాధారణంగా సర్వర్ల మెయింటనెన్స్‌ లేదా ఓవర్‌లోడ్‌ అయినప్పుడు కూడా ఇలాంటి అంతరాయం కలుగుతుంది. అయితే ప్రస్తుత సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని