China Xi Jinping: పిల్లలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాఠాలు!

చైనా (China)లో పిల్లలకు మార్కిసిస్ట్‌ భావజాలాన్ని పెంపొందించేలా పాఠాలు చెప్పాలని షీజిన్‌పింగ్‌ (Xi jinping) నిర్ణయించారు.

Published : 25 Aug 2021 23:34 IST

బీజింగ్‌ (Beijing): చైనా (China)లో పిల్లలకు ఇక నుంచి షీజిన్‌పింగ్‌ (Xi jinping) భావజాలాన్ని నూరిపోయనున్నారు. ‘షీజిన్‌పింగ్‌ ఆలోచన’పై పాఠాలు పిల్లల్లో మార్క్సిస్టు భావజాలాన్ని పెంపొందిస్తాయని ఆ దేశ విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఉన్న విద్యావిధానంలోకి ఈ బోధనలను చొప్పించారు. లేబర్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ ఆన్‌ నేషనల్‌ సెక్యూరిటీలో కూడా ఈ పాఠాలు (Xi jinping Lessons) ఉంటాయి. ‘‘దేశం, సీసీపీ, సోషలిజంపై ప్రజల్లో ప్రేమను పెంపొందించే అంశాలపై ప్రాథమిక పాఠశాలలు దృష్టిపెట్టాలి. మధ్యస్థాయి పాఠశాలల్లో విద్యార్థులు రాజకీయ ప్రభావిత నిర్ణయాలు, అభిప్రాయాల నుంచి రక్షించేలా విజ్ఞానం, గ్రహణ శక్తిపై దృష్టిపెట్టాలి’’ అని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొంది.

చైనా కమ్యూనిస్టు పార్టీ (CCP) పట్టును విద్యావ్యవస్థపై కూడా పెంచేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. ‘షీజిన్‌పింగ్‌ థాట్‌’లో మొత్తం 14 సూత్రాలు ఉంటాయి. కొత్త ఆలోచనల అభివృద్ధి, సంపూర్ణ మార్పు, ప్రకృతి, మనిషి కలిసి జీవించడం, సైన్యంపై కమ్యూనిస్టు పార్టీ పట్టు, వన్‌ కంట్రీ టూ సిస్టమ్స్‌, మాతృభూమితో  పునరేకీకరణ వంటి అంశాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని