IT raids: ఒప్పో, షావోమికి ₹1000 కోట్ల ఫైన్‌..?

భారత్‌లో చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన షావోమీ, ఒప్పోలకు పెద్ద షాక్‌! ఈ రెండు సంస్థలు ఐటీ చట్టాల ఉల్లంఘనకు .......

Published : 31 Dec 2021 18:54 IST

దిల్లీ: భారత్‌లో చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన షావోమి, ఒప్పోకు పెద్ద షాక్‌! ఈ రెండు సంస్థలు ఐటీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డాయని, అందుకుగాను వాటికి రూ.1000 కోట్లకు పైగా జరిమానా విధించవచ్చని ఐటీ శాఖ తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై డిసెంబర్‌ 21న దిల్లీతో పాటు 11 రాష్ట్రాల్లోని ఒప్పో, షావోమి, ఫాక్స్‌కాన్‌, వన్‌ప్లస్‌ వంటి ప్రముఖ కంపెనీల ప్రాంగణాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు జరిపిన అధికారులు పలువురు అధికారుల్ని ప్రశ్నించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రెండు ప్రధాన కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాల్లో ఉన్న తమ గ్రూప్ కంపెనీలకు రూ.5500 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేశాయని సోదాల్లో తేలినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఐటీ చట్టం 1961 కింద సూచించిన ఆదేశాలను ఆ కంపెనీలు ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ఆ రెండు సంస్థలకు రూ.1000 కోట్లకు పైగా జరిమానా విధించాల్సి ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని