Yasin Malik: ఉగ్రవాదులకు నిధుల కేసు.. యాసిన్ మాలిక్‌కు జీవితఖైదు
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవితఖైదు పడింది.
దిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవితఖైదు పడింది. ఇప్పటికే ఈ కేసులో దోషిగా తేల్చిన పటియాలా హౌస్ ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యాసిన్ మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో ఎన్ఐఏ కోర్టు అతడిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం జీవితఖైదుకే మొగ్గుచూపింది.
అంతకుముందు ఎన్ఐఏ కోర్టులో వాదనల సందర్భంగా మాట్లాడిన యాసిన్ మాలిక్.. గడిచిన 28ఏళ్లలో జరిగిన హింస, ఉగ్రవాద కార్యకలాపాల్లో తన పాత్ర ఉందని నిఘా సంస్థలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా మరణశిక్షకు అంగీకరిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఎన్ఐఏ మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినందుకు అతనికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక తీర్పు నేపథ్యంలో శ్రీనగర్‌లో ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యాసిన్ మాలిక్ నివాసం సమీపంలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. అయితే, తీర్పు వెలువడుతోన్న సమయంలో యాసిన్ మాలిక్ మద్దతుదారులు కశ్మీర్లో నిరనలు చేపట్టారు.
ఇదిలాఉంటే, కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై 2017లో ఎన్ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్.. ‘ఫ్రీడమ్ స్ట్రగుల్’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్‌కు క్లీన్చిట్
లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్‌లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్‌డే!
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్‌గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్‌పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి