Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. ఎందుకంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ ఆదివారం ఉదయం అత్యవసరంగా ల్యాండయ్యింది....

Published : 26 Jun 2022 11:41 IST

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ ఆదివారం ఉదయం అత్యవసరంగా ల్యాండయ్యింది. లఖ్‌నవూ వెళ్లే నిమిత్తం వారణాసిలోని రిజర్వు పోలీసు లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే హెలికాప్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టడం వల్ల అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

అక్కడి నుంచి వెంటనే ఆదిత్యనాథ్‌ స్థానిక సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన విమానం ద్వారా లఖ్‌నవూ బయలుదేరనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ యంత్రాంగం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. శనివారం వారణాసి చేరుకున్న సీఎం.. అక్కడి పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతితో పాటు శాంతి భద్రతల అంశాలను సమీక్షించారు. ఈరోజు ఉదయం తిరిగి లఖ్‌నవూ బయలుదేరి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని