Manish Sisodia: మీరు నన్ను జైల్లో ఇబ్బంది పెట్టగలరు.. అంతే..!

మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆప్‌ నేత మనీశ్ సిసోదియా(Manish Sisodia) ట్వీట్ చేశారు. తనను కస్టడీకి అప్పగించడంపై ఆ పోస్టులో మాట్లాడారు. 

Published : 11 Mar 2023 12:01 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ(Delhi) మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) ప్రస్తుతం ఈడీ(ED)  కస్టడీలో ఉన్నారు. తాజాగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.  జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు. ‘సర్.. మీరు నన్ను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిషర్లు కూడా స్వాతంత్ర్య సమరయోధులను ఇబ్బందులకు గురిచేశారు. వారి స్థైర్యాన్ని కదిలించలేకపోయారు’ అని సిసోదియా ట్వీట్ చేశారు.

శుక్రవారం సిసోదియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్‌పై దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. మద్యం కుంభకోణంలో ఆయనది ప్రత్యక్ష పాత్రే అని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోదియాను కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అభ్యర్థనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.  ఆయనను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు సీబీఐ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు