SupremeCourt: జడ్జిని దూషించిన పిటిషనర్‌.. ఘాటుగా హెచ్చరించిన సుప్రీం కోర్టు

న్యాయమూర్తిని ఓ వ్యక్తి ‘ఉగ్రవాది’ అని దూషించారంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై నేరపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ షో కాజ్ నోటీజులు జారీ చేయాల్సిందిగా రిజిస్టరీని ఆదేశించింది.

Updated : 26 Nov 2022 00:12 IST

దిల్లీ: న్యాయమూర్తిని ఓ వ్యక్తి ‘ఉగ్రవాది’ అని దూషించారంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై నేరపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ షో కాజ్ నోటీజులు జారీ చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది.‘‘ కొన్ని నెలలపాటు జైల్లో ఉంటే అప్పుడే  మీకు వాస్తవం బోధపడుతుంది.’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం సదరు వ్యక్తిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులుపై మీరు ఎలాంటి ఆరోపణలు చేయలేరని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. 

పెండింగ్‌లో ఉన్న సర్వీస్ విషయంలో ముందస్తు విచారణ కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్‌కు సంబంధించిన ఫైలును ధర్మాసనం పరిశీలించిన తర్వాత న్యాయవాది సూచన మేరకు పిటిషనర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. దరఖాస్తు చేసిన సమయంలో మానసిక పరిస్థితి బాగోలేదని కోర్టుకు వివరించాడు.‘‘ మీరు న్యాయమూర్తిని ఉగ్రవాదితో పోల్చారు. అసలు ఈ విచారణకు న్యాయమూర్తికి సంబంధం ఏమిటి? అసలు మీరు ఎలా ఇలాంటి ఆరోపణలు చేస్తారు?’’ అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తన ప్రవర్తన తెలియజేస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని