Youtube: భారత్‌లో 17 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్!
భారత్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న 17 లక్షల వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 56 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది.
దిల్లీ: గత రెండేళ్ల కాలంలో యూట్యూబ్‌లో కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య పెరిగింది. దాంతో కంటెంట్ క్రియేటర్లు కూడా పెరిగారు. ఈ నేపథ్యంలో అశ్లీత, అసత్య కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూట్యూబ్ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తోంది. తాజాగా భారత్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న 17 లక్షల వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. 2022 జులై- సెప్టెంబరు త్రైమాసికంలో యూట్యూబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 1.7 మిలియన్ వీడియోలను తొలగించామని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 56 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. వీటిలో 36 శాతం వీడియోలను కేవలం ఒక్కరు మాత్రమే వీక్షించగా, 31 శాతం వీడియోలను ఒకటి నుంచి పది మంది మాత్రమే చూశారని తెలిపింది. వీటిని మెషీన్‌లెర్నింగ్ సాయంతో తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. 17 లక్షల వీడియోలతోపాటు యూట్యూబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 73.7 కోట్ల కామెంట్లను కూడా డిలీట్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 99 శాతం కామెంట్లను యూట్యూబ్‌లోని ఆటోమేటెడ్ సాంకేతికత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిందని పేర్కొంది. మిగిలిన ఒక శాతం కామెంట్లపై యూజర్లు అభ్యంతరం తెలపడంతో వాటిని తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!