YouTuber: మెట్రోలో టికెట్‌ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్‌పై నెటిజన్ల ఫైర్‌!

YouTuber: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడం కోసం ఓ యూట్యూబర్‌ చేసిన ప్రయత్నంపై బెడిసికొట్టింది. అతడి చర్యను తప్పుబడుతూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Updated : 23 Sep 2023 18:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో తమ వీడియోలు వైరల్‌గా మారడం కోసం కంటెంట్‌ క్రియేటర్లు నానా ప్రయత్నాలూ చేస్తుంటారు. అలాంటి కొన్ని ప్రయత్నాలు అందరినీ మెప్పిస్తాయి. మరికొన్ని మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తాయి. ఈ యూట్యూబర్‌ విషయంలో అదే జరిగింది. మెట్రో రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణం చేయడమే కాకుండా దాన్నంతటినీ ఓ వీడియో చేసి పెట్టాడు. దీంతో నెటిజన్లు అతడిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk)ను కౌగిలించుకోవడంతో ఫేమస్‌గా మారాడు యూట్యూబర్ ఫిడియాస్ పనాయోటౌ. ‘టికెట్‌ లేకుండా ఇండియన్‌ మెట్రోలో ఎలా ప్రయాణంచాలంటే’ అంటూ తాజాగా ఓ వీడియోను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. అందులో తాను బెంగళూరు మెట్రోలో టికెట్‌ లేకుండా ప్రయాణించిన మొత్తం వీడియోను షేర్‌ చేశాడు. ‘టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తా’ అంటూ మెట్రో స్టేషన్‌లోని ప్రయాణికులకు సైతం ఛాలెంజ్‌ చేశాడు. అలానే ఎంట్రీ పాయింట్‌లో సెక్యూరిటీ గార్డులెవరూ లేని సమయం చూసుకొని స్టేషన్‌లోకి ప్రవేశించి.. అదే రీతిన తిరిగి రావడం మొత్తాన్ని వీడియోలో పంచుకున్నాడు.

హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో అతడి అనైతిక ప్రవర్తన చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగా, ఒక కంటెంట్ క్రియేటర్‌గా ఇష్టపడుతున్నప్పటికీ, ఇది పూర్తిగా తప్పు, అనైతికం. కంటెంట్ కోసం ఇలాంటి పనులు చేయడం తప్పు’ అంటూ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఇలాంటి పనులు చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రోత్సహించకూడదు’ అంటూ ఒకరు.. ‘దేశంలోని నిబంధనలను పాటించే వరకు మళ్లీ భారతదేశానికి రావద్దు’ అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని