భారత్‌లో అందుబాటులోకి మరో వ్యాక్సిన్‌.. జైకొవ్‌-డి టీకాకు అనుమతి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్‌-డి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) శుక్రవారం అనుమతి మంజూరు చేసింది.

Published : 20 Aug 2021 20:23 IST

దిల్లీ: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్‌-డి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా ఇదే. జైకొవ్‌-డి ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత టీకా కావడం విశేషం.

జైకొవ్‌-డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది. తాజాగా అత్యవసర వినియోగానికి డీసీజీఐకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ టీకాకు 66.6 శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. 0-28-56 రోజుల్లో మూడు డోసుల్లో ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఈ జాబితాలో జైకోవ్‌-డి చేరింది. దీంతో దేశంలో అనుమతులు లభించిన వ్యాక్సిన్ల సంఖ్య ఆరుకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని