రాజస్థాన్‌లో గవర్నర్‌ నిర్ణయంపై ఉత్కంఠ!

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. కేబినెట్‌ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిఫార్సు చేయాలంటూ గవర్నర్‌ ఆదేశించడంతో.. గతరాత్రి మంత్రిమండలి సమావేశమైంది..........

Published : 25 Jul 2020 12:50 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. కేబినెట్‌ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిఫార్సు చేయాలంటూ గవర్నర్‌ ఆదేశించడంతో.. గతరాత్రి మంత్రిమండలి సమావేశమైంది. గవర్నర్‌ ప్రస్తావించిన ఆరు అంశాలపై తీర్మానం చేసింది. ఈరోజు దాన్ని గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు సమర్పించనున్నారు. మధ్యాహ్నం మరోసారి సీఎం మంత్రిమండలి సమావేశానికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అజెండాపై మరోసారి చర్చించనున్నట్లు సమాచారం. 

రాత్రి మంత్రి మండలి సమావేశం రెండు గంటల పాటు జరిగింది. బలనిరూపణ చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం సహా మొత్తం ఆరు అంశాలపై తీర్మానం రూపొందించారు. ఈ నోట్‌ను ఈరోజు గవర్నర్‌కు పంపనున్నారు. అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న సీఎం గహ్లోత్‌ సారథ్యంలో ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు ప్రకటించే వరకు ఆందోళన చేపడతామని గవర్నర్‌కు తెలిపారు. 

మరోసారి కేబినెట్‌ భేటీ నిర్వహించి శాసనసభ సమావేశానికి సిఫార్సు చేస్తే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గవర్నర్‌ వర్తమానం పంపారు. అనంతరం అక్కడి నుంచి ఆందోళన విరమించి కాంగ్రెస్‌ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత కేబినెట్‌ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల అజెండాపై చర్చించారు.

ఇదీ చదవండి..

రాజ్‌భవన్‌ వద్ద బలప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని