లాక్‌డౌన్ మేం కోరుకోవడంలేదు.. కానీ!: ఉద్ధవ్

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో మళ్లీ అక్కడ లాక్‌డౌన్‌ విధిస్తారా? అనే చర్చ కొనసాగుతున్న వేళ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. లాక్‌డౌన్‌ విధించే అంశంపై ఆయన.......

Published : 01 Mar 2021 18:21 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో మళ్లీ అక్కడ లాక్‌డౌన్‌ విధిస్తారా? అనే చర్చ కొనసాగుతున్న వేళ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. లాక్‌డౌన్‌ విధించే అంశంపై ఆయన నిరాసక్తత వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ విధించాలని తాము కోరుకోవడంలేదని, కానీ నిస్సహాయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలంతా విధిగా మాస్క్‌లు ధరించి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. 

పెట్రోల్‌ సెంచరీలు చూస్తున్నాం..

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా సీఎం స్పందించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి పోతున్నాయన్నారు. గతంలో విరాట్‌ కొహ్లీ, సచిన్‌ తెందుల్కర్‌ శతకాలు చూశాం.. కానీ ఇప్పుడు పెట్రోల్‌ డీజిల్‌ సెంచరీ చూస్తున్నామంటూ ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఎనిమిది వేలకు పైగా కొత్త కేసులు నమోదుతుండటం కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 8293 కొత్త కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 52,154మంది కొవిడ్‌తో మరణించారు. మరోవైపు, రాష్ట్రంలో రికవరీ రేటు 93.95శాతం ఉండగా.. మరణాల రేటు 2.42శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని