ViralVideo: పట్టర పట్టు హైలెస్సా..!
ప్రకృతిలో ప్రతి జీవీ అద్భుతమైందే. అందులో తేనెటీగలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే.. దశాబ్దాల పాటు నిల్వ ఉండే తేనెను తయారు చేయగలవు. పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో ప్రతిజీవీ అద్భుతమైందే. అందులో తేనెటీగలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే.. దశాబ్దాల పాటు నిల్వ ఉండే తేనెను అవి తయారు చేయగలవు. పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి సహజమైన చక్కెరగా మార్చగలవు. చిన్నగా ఉండే ఈ తేనెటీగలు డ్రింక్ సీసాకు ఉన్న మూతను కూడా తొలగించగలవు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా! కానీ.. ఇది నిజం. రెండు తేనెటీగలు ఐకమత్యంగా పనిచేసి ఫాంటా డ్రింక్ బాటిల్ మీద వదులుగా ఉన్న మూతను కిందకు పడగొట్టాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. తేనెటీగలు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. లాక్డౌన్లో తేనెటీగలు కొత్త మెళకువలు నేర్చుకుంటున్నాయని సరదా కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Michael Review: రివ్యూ : మైఖేల్
-
Movies News
K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు