Google Docs: గూగుల్ డాక్స్ వాడుతున్నారా?.. ఈ ఐదు సింపుల్ టిప్స్ మీకోసం!
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌కు బదులు యూజర్లు ఎక్కువగా వాడుతున్న వాటిలో గూగుల్ డాక్స్ ఒకటి. దీంతో యూజర్లు సులభంగా, వేగంగా డాక్యుమెంట్లను తయారు చేసుకునే వీలు ఉంది. డాక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ గూగుల్ యూజర్లను ఆకర్షిస్తోంది. అయితే, ఇందులో యూజర్ల సమయాన్ని ఆదా చేయడానికి, డాక్యుమెంట్ల తయారీకి కొన్ని సింపుల్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం..
వాయిస్ టైపింగ్ (Voice typing)..
గూగుల్ డాక్స్‌లో పొడవాటి డాక్యుమెంట్లను టైప్ చేయడానికి యూజర్లు కష్టపడకుండా వాయిస్ టైపింగ్ ఆప్షన్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. దీని సాయంతో ఎంత పెద్ద టెక్ట్స్‌నైనా వాయిస్ రూపంగా టైప్ చేయవచ్చు. దీనికోసం మైక్రోఫోన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం మెనూ బార్ పైభాగంలో ఉన్న టూల్స్/వాయిస్ టైపింగ్లోకెళ్లాలి. Ctrl+Shift+S షార్ట్ కట్ సాయంతోనూ దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మైక్రోఫోన్‌పై క్లిక్ చేసి టెక్ట్స్‌ను చదివితే డాక్యుమెంట్లలో టైప్ అవుతోంది. ఫంక్షనల్ కీస్‌ను కూడా ఇలాగే ఎంటర్ చేయవచ్చు. న్యూ లైన్, పారాగ్రాఫ్కి సైతం మాటల్లో చెబితే సరిపోతుంది.
ఎనేబుల్ లైవ్ వర్డ్ కౌంట్ (Enable live word count)..
కాలేజీ అసైన్మెంట్స్, ఆఫీసు రిపోర్ట్స్ లాంటి వాటిని తయారు చేస్తున్నపుడు సాధారణంగా వర్డ్ కౌంట్ ఎంతుంది అనే దాన్ని చూసుకుంటాం. మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఇది ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. కానీ, ఇది గూగుల్ డాక్స్‌లో డిఫాల్ట్‌గా హిడెన్ అయ్యి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే.. టూల్స్/వర్డ్ కౌంట్లోకెళ్లి ‘డిస్ప్లే వర్డ్ కౌంట్ వైల్ టైపింగ్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోగానే డాక్యుమెంట్ కింది భాగంలో ఎడమ వైపున వర్డ్ కౌంట్ చూపిస్తుంది.
సజేషన్ మోడ్ (Suggestion Mode)..
గూగుల్ డాక్స్‌లో అక్షర దోషాలు, వాక్య నిర్మాణ లోపాలను ఆటోమెటిక్‌గా గుర్తిస్తోందనే విషయం తెలిసిందే. అయినా డాక్యుమెంట్లలో ఇంకా మార్పులు చేయాలనుకునే వారికోసం ‘సజేషన్ మోడ్’ అందుబాటులో ఉంది. దీనిద్వారా డాక్యుమెంట్లో ఎక్కడ మార్పులు చేయాలో సులువుగా తెలుసుకోవచ్చు. దీనికోసం గూగుల్ డాక్స్ స్క్రీన్ పైభాగంలో కుడివైపు ఉన్న ‘ఎడిటింగ్’ ఆప్షన్‌ను ఎంచుకొని డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయాలి. తర్వాత ‘సజేషన్ మోడ్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
చెక్ రివిజన్ హిస్టరీ..(Check Revision history)..
డాక్యుమెంట్లను ఎవరికైనా షేర్ చేసిన తర్వాత అందులో ఏమేం మార్పులు చేశారో తెలుసుకోవడానికి ‘చెక్ రివిజన్ హిస్టరీ’ పనిచేస్తుంది. మార్పులు చేసిన టెక్ట్స్‌ను డాక్యుమెంట్లలో హైలైట్ చేసి చూపిస్తోంది. ఎడిట్ చేసిన డాక్యుమెంట్ రిటర్న్ వచ్చిన తర్వాత ఎడిట్ హిస్టరీలోకెళ్లి చెక్ చేసుకోవచ్చు.
కస్టమైజ్డ్ షార్ట్‌కట్స్.. (Customised shortcuts)..
గూగుల్ డాక్స్‌లో కొన్ని నిర్దిష్ట అక్షరాలకు సైతం కీ బోర్డు షార్ట్‌కట్స్ ఉన్నాయి. అయితే కొందరు ఎక్కువగా వాడే అక్షరాలకు ప్రత్యేకమైన షార్ట్‌కట్స్ ఉండకపోవచ్చు. దీనికోసం గూగుల్ డాక్స్‌లో ప్రత్యేకమైన ట్యాబ్ ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన వాటిని కూడా యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం టూల్స్/పెర్ఫార్మెన్స్లోకెళ్లి సబ్స్టిట్యూషన్ ట్యాబ్ కుడి భాగంలో ఉన్న కస్టమ్ షార్ట్‌కట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కొత్త వాటిని కూడా యాడ్ చేసుకొని షార్ట్‌కట్ కీస్గా పెట్టుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Basavaraj Bommai: కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు.. స్పందించిన బొమ్మై!
-
General News
Telangana News: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలి: హైకోర్టు
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
Politics News
Kejriwal: సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. ఇదెక్కడి ప్రభుత్వం..?
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
General News
TS Eamcet: రేపు ఉదయం ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు