Updated : 23 Sep 2021 12:53 IST

Abhinav Bindra meets Neeraj Chopra: చోప్రాకు ‘టోక్యో’ను గిఫ్ట్‌గా ఇచ్చిన అభినవ్‌ బింద్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ షూటర్‌ అభినవ్‌ బింద్రా.. గోల్డెన్‌ మ్యాన్‌ నీరజ్ చోప్రాను కలిసి ఓ బహుమతిని ప్రదానం చేశారు. టోక్యోలో భారత్‌కు స్వర్ణం అందించిన తర్వాత నీరజ్‌ను మొదటిసారి అభినవ్‌ కలవడం విశేషం. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అభినవ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఇద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. అందులో అభినవ్‌.. నీరజ్‌కు కుక్కపిల్లను బహుమతిగా ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘గోల్డెన్‌ మ్యాన్‌ నీరజ్‌ చోప్రాను కలిసి మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌ నాకొక మంచి స్నేహితుడిని ఇచ్చింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ నీరజ్‌ పతకం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ‘టోక్యో’ తనకు మద్దతుగా నిలిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అభినవ్‌ రాసుకొచ్చారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా  షూటర్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించారు. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో ఆ ఘనత సాధించి కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts