Published : 05 Oct 2020 19:42 IST

వింటేజ్‌ జాబితాలోకి ఐపాడ్ నానో..

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్లో ప్రతి ఏడాది ఎన్నో రకాల కొత్త ఉత్పత్తులు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని వినియోగదారులను ఆకట్టుకుని స్థిరమైన మార్కెట్‌ను ఏర్పరచుకుంటాయి. అలా యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఐపాడ్‌లకు దశాబ్దం క్రితం వరకు విపరీతమైన డిమాండ్ ఉండేది. తొలుత వాటిలో కేవలం పాటలు వినేందుకు మాత్రమే అవకాశం ఉండేది. తర్వాత వాటిని మరింత అభివృద్ధి చేసి వీడియోలు చూసేందుకు వీలుగా తయారుచేశారు. కాలక్రమేణా ఐపాడ్‌లు రూపాంతంరం చెంది ఐప్యాడ్‌లుగా మారాయి. తాజాగా యాపిల్ ఐపాడ్‌ మోడల్స్‌లో ఏడో తరం ఐపాడ్‌ నానోను వింటేజ్‌ (పాత తరం) జాబితాలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే నాలుగో తరం ఐపాడ్‌ షఫుల్, ఐదో తరం ఐపాడ్ టచ్‌లు యాపిల్ వింటేజ్‌ ఉత్పత్తుల జాబితాలో చేర్చింది.

వింటేజ్ జాబితా అంటే..?

సుమారు ఐదు సంవత్సరాల పాటు అమ్మకాలు జరగని వాటిని వింటేజ్‌ లేదా ఉపయోగంలో లేని ఉత్పత్తుల జాబితాలో చేర్చుతారు. కానీ ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఉత్పత్తినైనా ఉపయోగంలో లేనిదిగా గుర్తిస్తారు. అలాంటి వాటికి సర్వీస్‌ సేవలు పొందే అర్హత కూడా ఉండదు. అయితే ఐపాడ్ నానో కస్టమర్స్‌ మాత్రం థర్డ్‌ పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ ద్వారా ఇప్పటికీ రిపేర్‌/సర్వీస్‌ సేవలను పొందొచ్చని యాపిల్ తెలిపింది.

ఐపాడ్ నానో కథ..  

ఐపాడ్ నానోను యాపిల్ 2005లో తీసుకొచ్చింది. 1.5-అంగుళాల కలర్‌ స్క్రీన్‌, స్ర్కోల్‌ వీల్‌తో ఎంతో ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దారు. ఆకట్టుకునే డిజైన్‌, చిన్న సైజ్‌, సులభతరమైన ఆపరేటింగ్ ఫీచర్స్‌తో నానో వినియోగదారులకు చేరువైంది. ఏడాది తర్వాత యాపిల్ అల్యూమినియం కేస్‌తో రెండో తరం ఐపాడ్ నానోను తీసుకొచ్చింది. అలానే 2007లో కొత్త డిజైన్‌ లాగ్వేంజ్‌తో మూడో తరం ఐపాడ్ నానోను విడుదల చేశారు. ఇందులో వీడియోలు చూసేందుకు 2-అంగుళాల డిస్‌ప్లేను ఇచ్చారు. అలా 2008, 2009లో వరుసగా కాండీబార్ డిజైన్‌, పొడవాటి డిస్‌ప్లే, రకరకాల రంగుల్లో ఐపాడ్ నానోలను విడుదల చేశారు. వీటిలో 2009 మోడల్‌లో వీడియో కెమెరా కూడా ఇవ్వడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు.

2010లో స్క్రోల్ వీల్‌ లేకుండా వీడియో ప్లే ఫీచర్‌ను తొలగించి చతురస్రాకారంలో టచ్‌ స్క్రీన్‌తో కొత్త ఐపాడ్ నానోను విడుదల చేశారు. చివరిగా 2012లో ఏడో తరం ఐపాడ్‌ నానోను తీసుకొచ్చారు. ఇందులో 2.5-అంగుళాల టచ్ స్క్రీన్‌ డిస్‌ప్లే, హోమ్ బటన్, లైటింట్ పోర్ట్‌లను ఇచ్చారు. 2015లో మూడు రంగుల్లో ఐపాడ్‌ నానో అప్‌డేట్‌ చేశారు. తర్వాత నుంచి ఐపాడ్లను యాపిల్ తన ఉత్పత్తుల జాబితా నుంచి తొలగించింది. తాజాగా వాటిని వింటేజ్‌ ఉత్పత్తుల జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని