ఐఓఎస్‌ 14 ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

యాపిల్‌ ఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఓఎస్‌ అప్‌డేట్‌ను ఎట్టకేలకు కంపెనీ విడుదల చేసింది. సెప్టెంబరు 17 నుంచి ఐఓఎస్‌ 14ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులతో....

Updated : 21 Sep 2020 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ ఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఓఎస్‌ అప్‌డేట్‌ను ఎట్టకేలకు కంపెనీ విడుదల చేసింది. సెప్టెంబరు 17 నుంచి ఐఓఎస్‌ 14ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులతో పోలిస్తే ఐఓఎస్‌ వాడేవారు తక్కువ. అయినప్పటికీ ప్రపంచంలోనే రెండో అతి మొబైల్ మార్కెట్‌ కావడంతో భారతీయ యూజర్స్‌ కోసం పలు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. మరి ఆ ఫీచర్సేంటో?, వాటితో ఏమేం చేయొచ్చో ఒకసారి చూసేద్దాం..

* మనం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష రాక ఇబ్బందులు పడుతుంటాం. ఇక మీదట అలాంటి కష్టాలకు చెక్‌ పెడుతూ ప్రత్యేకంగా ట్రాన్స్‌లేషన్ యాప్‌ను ఐఓఎస్‌ 14లో అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్‌. ఈ యాప్‌లో ప్రపంచంలోని 12 భాషలు (అరబిక్‌, చైనీస్‌, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటీష్‌ ఇంగ్లీష్, ఫ్రెంచ్‌, జర్మనీ, ఇటాలియన్‌, జపనీస్, కొరియన్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్) ట్రాన్స్‌లేషన్‌ చేసుకోవచ్చు. ఈ జాబితాలో హిందీ లేకపోడం గమనార్హం. అయితే, రాబోయే రోజుల్లో హిందీతో పాటు మరికొన్ని భాషలనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

* భారతీయ యూజర్స్‌ కోసం యాపిల్ మరో కొత్త ఫీచర్‌ను పరియం చేసింది. ఇక మీదట హిందీ భాషలో ఉండే ఈ-మెయిల్ ఐడీలకు ఐఓఎస్‌లోని మెయిల్ యాప్‌ నుంచి మెయిల్స్‌ పంపొచ్చు. గతంలో హిందీలో ఉండే మెయిల్‌ ఐడీలను ఈ యాప్‌  సపోర్ట్ చేసేది కాదు. ఐఓఎస్‌ 14లో ఇందుకు తగినట్లుగా మార్పులు చేశారు.

* గతేడాది విడుదల చేసిన ఐఓఎస్‌ 13లో వర్చువల్ అసిస్టెంట్ సిరిలో భారతీయుల స్వరాన్ని పోలిన గొంతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఐఓఎస్‌ 14లో దీనికి మరింత వాస్తవికతను జోడిస్తూ గ్రాఫిక్స్ పరంగా కూడా పలు మార్పులు చేశారు. సిరి ద్వారా ఐఓఎస్, కార్‌ప్లే నుంచి ఆడియో మెసేజ్‌లను పంపొచ్చు. అలానే థర్డ్‌ పార్టీ మెసేజింగ్ యాప్స్‌ను కూడా సిరి సపోర్ట్‌ చేస్తుది. వీటితో పాటుగా ట్రాన్స్‌లేషన్‌ యాప్‌లో ఉన్న అన్ని యాప్‌లను సిరి సపోర్ట్‌ చేస్తుందని యాపిల్‌ తెలిపింది. 

* ఐమెసేజ్‌లో కూడా యాపిల్‌ కీలక మార్పులు చేసింది. మెసేజ్‌ సంభాషణల్లో వాట్సాప్‌ లాగా  గతంలో పంపిన మెసేజ్‌పై క్లిక్‌ చేసి దానికి మాత్రమే రిప్లై ఇచ్చే ఫీచర్‌ను పరిచయం చేశారు. గ్రూప్‌లో జరిగే సంభాషణలకు ప్రత్యేకంగా ఫొటో, మెమోజీ, ఎమోజీ పెట్టుకోవచ్చు. అలానే స్పామ్‌ మెసేజ్‌ల కట్టడికి ఐదు ఫిల్టర్లను తీసుకొచ్చారు. అవి ప్రమోషనల్‌, ట్రాసాక్షనల్, నోన్‌ సెండర్స్‌, అనోన్‌ సెండర్స్‌, జంక్‌. వీటితో మెసేజ్‌లను మరింత సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు.

* ఇవే కాకుండా హోం స్క్రీన్‌లో విడ్జెట్స్‌, యాప్స్‌ అన్నింటినీ కేటగిరీల వారీగా విభజించి యాప్‌ లైబ్రరీని మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చారు. ఫోన్‌లో ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు సాధారణ కాల్స్‌ వస్తే అవి స్క్రీన్ పైభాగంలో పాప్‌అప్‌ అయ్యేలా కొత్త ఫీచర్‌ని యాడ్‌ చేశారు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని