Published : 17 Nov 2020 22:58 IST

యాపిల్ ఫోల్డింగ్ ఫోన్‌ వచ్చేది ఎప్పుడంటే..!

ఇంటర్నెట్ డెస్క్‌: మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తూ తమ మార్కెట్‌ పరిధిని విస్తరిస్తుంటాయి. ఈ విషయంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంచెం వెనకే ఉందని చెప్పాలి. ఎందుకంటే..శాంసంగ్‌, మోటోరోలా వంటి కంపెనీలు ఇప్పటికే ఫోల్డింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తే యాపిల్ మాత్రం ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. టెక్‌ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబరు 2022 నాటికి యాపిల్ తన తొలి ఫోల్డింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోందట. ఈ మేరకు ఫోన్‌లో ఉపయోగించే విడిభాగాల కోసం తైవాన్‌కు చెందిన హోన్‌ హాయ్‌, నిప్పాన్‌ నిప్పాన్‌ కంపెనీలతో చర్చించినట్లు సమాచారం.

ఈ ఫోల్డింగ్ ఫోన్‌ డిస్‌ప్లే కోసం ఓఎల్‌ఈడీ లేదా మైక్రో ఎల్‌ఈడీ స్క్రీన్‌ టెక్నాలజీ ఉపయోగించనున్నారట. అలానే ఈ ఫోన్‌కి డిస్‌ప్లే ప్యానెల్‌ను శాంసంగ్ అందిచనుందట. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫోన్‌లోని ఎక్కువ శాతం విడిభాగాలను న్యూ నిక్కో కంపెనీ సరఫరా చేస్తుందట. అలానే హోన్‌ హాయ్‌ కంపెనీ యాపిల్ ఫోల్డింగ్ ఫోన్‌ని అసెంబుల్ చేస్తుందని తెలుస్తోంది. అలానే ఫోన్‌లో ఉపయోగించే ఫోల్డింగ్ టెక్నాలజీతో అందుకు అవసరమైన పరికరాలను నిప్పాన్‌ నిప్పాన్ కంపెనీ సరఫరా చేయనుందట. తయారీకి ముందే ఫోల్డింగ్ ఫోన్‌కు లక్ష సార్లు ఫోల్డింగ్ పరీక్షలు నిర్వహిస్తారట. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డింగ్ ఫోన్లకు కూడా ఇదే తరహాలో పరీక్షలు నిర్వహించారు. అయితే త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలతో యాపిల్ ఒక ప్రకటన చేయనుందని సమాచారం.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని