Published : 04 Dec 2020 23:51 IST

2021లో యాపిల్‌ ఏం తెస్తోందంటే..!

ఇంటర్నెట్ డెస్క్‌: యాపిల్ కంపెనీ ఇటీవలే సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్‌తో మూడు మ్యాక్ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్‌ ప్రాసెసర్‌లకు స్వస్తి పలికింది. తనే స్వయంగా రూపొందించిన ఏఆర్‌ఎం ఆధారిత సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్ల వినియోగానికి నాంది పలికింది. అంతేకాకుండా యాపిల్ రూపొందించిన ఎమ్‌1 ప్రాసెసర్లు మెరుగైన పనితీరును అందించడమే కాకుండా బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేసేందుకు దోహదపడుతోందట. తాజాగా ఎమ్‌1 ప్రాసెసర్లు అందించిన విజయంతో యాపిల్ కంపెనీ ఎమ్‌2 పేరుతో కొత్త ప్రాసెసర్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని టెక్‌ వర్గాల సమాచారం.

వచ్చే ఏడాది యాపిల్ విడుదల చేయనున్న 13-అంగుళాలు, 16-అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రొ ల్యాప్‌టాప్‌లలో ఈ ఎమ్‌2 ప్రాసెసర్లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా యాపిల్‌ 2021లో కొత్త డిజైన్‌తో మ్యాక్‌బుక్‌ ప్రొ మోడల్స్‌ని విడుదల చేయనుందట. అలానే 2022లో మిని-ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో మ్యాక్‌బుక్ ఎయిర్‌, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లను యాపిల్‌ విడుదల చేస్తుందని సమాచారం.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని