Updated : 24/04/2020 08:14 IST

వైరస్‌ను పసిగట్టే బయోసెన్సర్‌

కరోనా వైరస్‌ ఆనవాళ్లను  పట్టేసేందుకు బయోసెన్సర్‌ ఒకటి రూపుదిద్దుకుంది. ప్రొఫెసర్‌ జింగ్‌వాంగ్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం దీనిని కనుగొన్నది. ఈయన స్విట్జర్లాండ్‌లోని ‘ఎంపా’(జ్యూరిచ్‌) పరిశోధనశాలలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనశాలల్లో రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల్లో చాలా తక్కువస్థాయిలో వైరస్‌ ఉన్నప్పటికీ ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. అయితే ఫలితాలు వెల్లడయ్యేందుకు ఆలస్యమవుతోంది. దీనికి మరో ప్రత్యామ్నాయంగా జింగ్‌వాంగ్‌ బృందం బయోసెన్సర్‌ను సృష్టించింది. ఈ సెన్సర్‌తో ఎంతో సురక్షితంగా, కచ్చితత్వంతో వైరస్‌ను కనిపెట్టవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ‘లోకలైజ్డ్‌ సర్ఫేస్‌ ప్లాస్మన్‌ రిసోనెన్స్‌’ సాంకేతికతను ఇందుకోసం వినియోగించారు. బయోసెన్సర్‌ ద్వారా కృత్రిమ డీఎన్‌ఏ గ్రాహకాలను ఏర్పరుస్తూ అనుమానితుల నమూనాల్లో ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ క్రమాలను గుర్తించడం ద్వారా కరోనా సోకిందా లేదా అని తక్కువ సమయంలో పసిగట్టవచ్చునని పరిశోధకులు చెప్పారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని