- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కారే.. విమానంగా మారే!
ఇంటర్నెట్ డెస్క్: కారు విమానంగా మారి గాల్లో ఎగరడాన్ని మనం అనేక సినిమాల్లో చూశాం. ఫ్లయింగ్ కార్లు ఓ అత్యాధునిక ఊహగా భావిస్తాం. అయితే దీనిని నిజం చేయటానికి స్లోవేకియాకు చెందిన ఓ సంస్థ ముప్ఫై ఏళ్ల పాటు కృషి చేసింది. ఎట్టకేలకు ఎగిరే కారును తయారు చేసినట్టు క్లెయిన్ విజన్ అనే ఈ సంస్థ ప్రకటించింది. తమ ‘ఎయిర్‌కార్’ ప్రయోగ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుందని ఈ పరిశోధనా సంస్థ వెల్లడించింది.
క్లెయిన్ విజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌కార్ పేరులో ఉన్న విధంగానే నేలపై, ఆకాశంలో కూడా ప్రయాణించగలదు. 1100 కిలోల బరువు ఉండే ఈ సూపర్ కార్, 200 కిలోల బరువు మోయగలదు. కేవలం మూడు నిముషాల వ్యవధిలోనే కారు విమానంగా మారే క్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిని చూసిన వారు ‘‘ఎట్టకేలకు ఎగిరే కారు అనే ఆలోచన కళ్ల ముందుకొచ్చింది.. చాలా ఆకట్టుకుంటోంది.. ప్రొఫెసర్ క్లెయిన్ అండ్ టీమ్‌కు అభినందనలు.. వీలైనంత త్వరలో నాకూ ఒకటి కావాలి..’’ అంటూ ఉత్సాహంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆ అద్భుతాన్ని మీరూ చూసేయండి మరి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
World News
Srilanka: బ్యాంకాక్‌లో గొటబాయ.. 24న శ్రీలంకకు తిరిగొచ్చేస్తున్నారట!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
-
Politics News
Koppula Eshwar: మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
Politics News
Nitish Kumar: నీతీశ్ కేబినెట్లో72% మందిపై క్రిమినల్ కేసులు.. 27మంది కోటీశ్వరులే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
- BJP: మునుగోడు బహిరంగ సభకు భాజపా ఇన్‌ఛార్జ్‌ల నియామకం