Updated : 20 Jul 2020 15:58 IST

నిమ్స్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ డోస్‌ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని