యాపిల్ కొత్త ఓఎస్‌లో వీటిని గమనించారా..

ఐఓఎస్‌ యూజర్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ను యాపిల్ ఎట్టకేలకు విడుదల చేసింది. ఐఓఎస్ 14 పేరుతో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్‌ను ఇందులో పరిచయం చేశారు....

Published : 12 Oct 2020 21:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఓఎస్‌ యూజర్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ను యాపిల్ ఎట్టకేలకు విడుదల చేసింది. ఐఓఎస్ 14 పేరుతో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్‌ను ఇందులో పరిచయం చేశారు. వీటితో ఐఓఎస్‌ యూజర్స్ మెరుగైన పనితీరును పొందుతారని యాపిల్ తెలిపింది. మరి ఆ ఫీచర్స్‌ ఏంటి..అవి ఎలా పనిచేస్తాయో.. ఒక్కసారి చూద్దాం..

విడ్జెట్‌

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో అందుబాటులో ఉన్న మరో కొత్త ఫీచర్‌ని యాపిల్ ఐఓఎస్‌ 14లో తీసుకొచ్చింది. అదే విడ్జెట్‌ ఫీచర్. ఐఫోన్ హోం స్క్రీన్‌లో విడ్జెట్‌ ఫీచర్‌ ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది. బ్యాటరీ, ఫొటోస్‌, వాతావరణం, టైం, క్యాలెండర్ యాప్స్‌ను విడ్జెట్‌లో యాడ్ చేసుకోవచ్చు.

హిడెన్‌ ఫొటోస్‌

ఫొటోస్‌ హిడెన్ ఫీచర్‌ ఐఫోన్‌ గతంలోనే అందుబాటులో ఉంది. తాజాగా ఐఓఎస్‌14లో దాన్ని మరిన్ని మెరుగులద్దారు. సెట్టింగ్స్‌లో కొత్తగా  హిడెన్‌ ఆల్బమ్ అనే ఫీచర్‌ను యాడ్ చేశారు.

యాప్‌ లైబ్రరీ

మరో ముఖ్యమైన ఫీచర్‌ యాప్‌ లైబ్రరీ. అన్ని యాప్‌లను అవసరానికి తగినట్లుగా కేటగిరి వారిగా క్రమపద్ధతిలో అమర్చుతుంది. దానివల్ల యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే  మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్స్‌ని వెంటనే యాక్సెస్‌ చేసుకునేలా ప్రాధాన్య క్రమంలో చూపిస్తుంది. హోం స్క్రీన్‌ను స్వైప్ చేస్తే యాప్‌ లైబ్రరీ కనిపిస్తుంది. 

జీమెయిల్ డీఫాల్ట్‌గా

చాలా కాలంగా మెయిల్ సేవల కోసం థర్డ్‌ పార్టీ యాప్‌లను యాపిల్ అనుమతించలేదు. దీంతో చాలా మంది ఐఓఎస్ యూజర్స్‌ యాపిల్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఐఓఎస్‌ 14లో జీమెయిల్‌ను డీఫాల్ట్‌ మెయిల్ యాప్‌గా అనుమతించారు. 

పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌

గతంలో ఐఫోన్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు వీడియో కాల్స్‌ వస్తే వీడియో ఆగిపోయేది. అయితే ఐఓఎస్‌ 14లో ఈ కష్టాలకు తెరదించుతూ పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఫీచర్‌ని పరిచయం చేశారు. అంటే మరో యాప్‌లో వీడియో చూస్తూ కాల్స్‌ని కూడా మాట్లాడొచ్చు.

యాపిల్ మ్యాప్స్‌

గూగుల్ యాప్స్‌కి పోటీగా యాపిల్ మ్యాప్స్‌లో కూడా పలు కీలక మార్పులు చేశారు. ఐఓఎస్‌ 14 అప్‌డేట్‌లో యాపిల్‌ మ్యాప్స్‌లో సైక్లింగ్‌ చేసేందుకు అనువైన దారులను చూపడటంతో పాటు, రద్దీ రోడ్లు, మెట్ల మార్గం, చిన్న చిన్న సందులు వంటి వాటిని కూడా ఇందులో చూపిస్తుంది.

మరిన్ని ఐఓఎస్‌ 14 ఫీచర్స్‌ కోసం కింద క్లిక్‌ చేయండి..

ఐఓఎస్‌ 14  ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని