Updated : 23 Apr 2020 18:19 IST

కరవు భత్యంపై కేంద్రం కీలక నిర్ణయం

కోత విధించిన ఆర్థిక శాఖ...

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దార్లకు అదనపు కరవు భత్యం చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జనవరి 1 నుంచి చెల్లించాల్సి ఉన్న అదనపు కరవు భత్యాన్ని చెల్లించబోమని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జనవరి 1 నుంచి జులై 1 వరకు చెల్లించాల్సిన అదనపు కరవు భత్యాన్ని కూడా రద్దుచేసినట్టు ఆ శాఖ తెలిపింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ శాఖ నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ఈ నిర్ణయం వల్ల 2020×21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.37,530 కోట్లు ఆదా అవుతుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలకు అధిక మొత్తంలో కేటాయింపులు అవసరమైనందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని