Published : 11 Sep 2020 22:50 IST

హువావే ఇయర్‌బడ్స్‌..స్మార్ట్‌వాచ్‌..ఇంకా..

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే డిజైన్‌, ఫీచర్స్‌తో సరికొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ల దాకా నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా హువావే పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ల్యాప్‌టాప్‌, వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లున్నాయి. మరి వాటి ఫీచర్స్‌ ఏంటి..ధరెంత..భారత మార్కెట్లోకి ఎప్పుడు రాబోతున్నాయి వంటి వివరాలను చదివేయండి మరి..


హువావే ఫ్రీ బడ్స్‌ ప్రో

ప్రపంచంలోనే తొలి ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ ఇవేనని హువావే తెలిపింది. డైనమిక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్, చెవిలో ఇమిడిపోయే డిజైన్‌, డ్యూయల్ యాంటీనా వంటి ఫీచర్స్‌తో పాటు కోచి, జనరల్, అల్ట్రా మోడ్స్‌ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 30 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తాయి. వీటి ధర 199 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.17,000. అక్టోబరు నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. సిల్వర్‌ ఫ్రోస్ట్‌, కార్బన్‌ బ్లాక్‌, సెరామిక్ వైట్ రంగుల్లో లభిస్తుంది.


హువావే ఫ్రీలేస్ ప్రో

ఇందులోని ట్రిపుల్ మైక్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేప్పుడు, మ్యూజిక్‌ వినేప్పుడు యూజర్స్‌ ప్రో సౌండ్ అనుభూతిని పొందుతారు. ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటలపాటు మ్యూజిక్ వినవచ్చు. అలానే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 24 గంటల పాటు పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలుగా హువావే నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 10,000. ఈ నెలలోనే వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. గ్రాఫైట్ బ్లూ, స్పూస్‌ గ్రీన్‌, డాన్ వైట్ రంగుల్లో లభిస్తుంది.


హువావే వాచ్‌ జీటీ 2 ప్రో

హువావే స్మార్ట్‌వాచ్‌ హార్ట్‌రేట్, ఆక్సిజన్‌ లెవల్స్‌, నిద్ర సమయం, ఒత్తిడిని మానిటర్‌ చేయడమే కాకుండా హార్ట్‌రేట్‌లో హెచ్చుతగ్గులు ఉంటే యూజర్‌ని వెంటనే అప్రమత్తం చేస్తుంది. స్పోర్ట్స్, వర్కవుట్స్‌ అంటే ఇష్టపడే వారి కోసం ఇందులో వందకు పైగా వర్కవుట్ మోడ్స్‌ ఉన్నాయి. మీ రోజువారీ యాక్టివిటీని ట్రాక్‌ చేయడంతో పాటు మీ ఫిట్‌నెస్‌ గోల్స్‌ పూర్తి చేసేలా మీకు సహాయపడుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు వారాలపాటు పనిచేస్తుంది. క్లాసిక్, స్పోర్ట్ మోడల్స్‌లో ఈ వాచ్‌ లభిస్తుంది. స్పోర్ట్ వేరియంట్ ధర 329 యూరోలు (సుమారు రూ. 28,000), క్లాసిక్‌ వేరియంట్ ధర 349 యూరోలు (సుమారు రూ. 30,000). ఈ నెలలోనే వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 


హువావే వాచ్‌ఫిట్‌

హువావే ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లో 96 రకాల వర్కవుట్స్‌ మోడ్స్‌, జీపీఎస్‌ ట్రాకింగ్ ఉన్నాయి. అలానే మీరు వర్కవుట్స్‌ చేసేప్పుడు మిమ్మల్ని గ్రాఫిక్స్‌ ద్వారా గైడ్‌ చేసి తగు సూచనలు చేస్తుంది. హార్ట్‌రేట్‌, ఆక్సిజన్ లెవల్స్‌ని మానిటర్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది రోజులపాటు పనిచేస్తుంది. దీని ధర 129 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో రూ. 11,000. గ్రాఫైట్ బ్లాక్‌, సకురా పింక్‌, మింట్ గ్రీన్‌, కాంటాలౌప్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

వీటితో పాటు హువావే మేట్‌బుక్‌ ఎక్స్‌, మేట్‌బుక్‌ 14 అనే రెండు ల్యాప్‌టాప్‌లను కూడా విడుదల చేసింది. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, టెన్త్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్ ప్రాసెసర్‌, అధిక బ్యాటరీ సామర్థ్యంతో వీటిని తయారుచేశారు. ప్రస్తుతం ధర ప్రకారం వీటిని యూరోపియన్‌ మార్కెట్లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధరెంత వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని