త్వరలో 4K క్వాలిటీతో ఒప్పో స్మార్ట్‌ టీవీ..?

స్మార్ట్‌ ఫోన్ల విభాగంలో దూసుకెళ్తున్న ఒప్పో టీవీల విపణిలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తన కొత్త స్మార్ట్‌ టీవీని వచ్చే...

Published : 30 Sep 2020 23:43 IST

అధికారికంగా వెల్లడించని సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ ఫోన్ల విభాగంలో దూసుకెళ్తున్న ఒప్పో టీవీల విపణిలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తన కొత్త స్మార్ట్‌ టీవీని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీ, టీవీ ఫీచర్స్‌కు సంబంధించి సంస్థ నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 4K 120fps డిస్‌ప్లేతో రానుందని వార్తలు మాత్రం వచ్చాయి. రంగులను స్పష్టంగా అందిస్తూ 8k RAW సామర్థ్యంతో స్మార్ట్‌టీవీ పనిచేయనుందని సమాచారం. ఒప్పో స్మార్ట్‌ టీవీ 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో లభించనుంది. రెండు వెర్షన్స్‌లోనూ 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 4K క్వాంటమ్‌ డాట్ పానెల్స్‌ ఉండనున్నాయి. మంచి సౌండింగ్‌ కోసం డానిష్‌ బ్రాండ్‌ ఆడియో సిస్టమ్‌ను అందించనుంది. 65 అంగుళాల స్మార్ట్‌ టీవీతో పోలిస్తే 55 అంగుళాల ఒప్పో స్మార్ట్‌ టీవీ ధర అందుబాటులో ఉండే అవకాశం ఉందని మార్కెటింగ్‌ నిపుణులు పేర్కొన్నారు.

సెల్ఫీ కెమెరాలతో ఆకట్టుకుంటున్న ఒప్పో ఇప్పటికే కొత్తగా మరో రెండు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఒప్పో ఎఫ్17 ప్రో, ఎఫ్17 పేరుతో విడుదలయిన ఈ ఫోన్లలో సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్‌ కెమెరా, 30 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ విస్తరణ లక్ష్యంగా ఒప్పో వీటిని తీసుకొచ్చింది. ఒప్పో ఎఫ్‌17 ప్రో 8 జీబీ/ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.22,990గా కంపెనీ నిర్ణయించింది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని